రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన నిర్ణయం…

రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని పదవి నుంచి దిమిత్రిని తొలగించారు. అంతేకాదు దిమిత్రితో సహా రష్యా ప్రభుత్వ మంత్రిమండలి సభ్యులు కూడా పదవుల నుంచి వైదొలగాలని ఆదేశించారు. రాజ్యాంగ సవరణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్న పుతిన్.. దిమిత్రి స్థానంలో రష్యా నూతన ప్రధానిగా మైఖైల్ మిషుస్తిన్ పేరును ప్రతిపాదించారు. మాజీ ప్రధాని దిమిత్రిని జాతీయ భద్రతా మండలి డిప్యూటీగా నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఇక నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్న మిషుస్తిన్ 1998 నుంచి ట్యాక్స్ సర్వీస్ అధికారిగా సేవలందించారు. 2010 నుంచి రష్యా ఫెడరల్ ట్యాక్స్ సర్వీసెస్ అధినేతగా మిషుస్తిన్ కొనసాగుతున్నారు.