విండోస్-7 వీడాలంటూ మైక్రోసాఫ్ట్ ప్రకటన….

మైక్రోసాఫ్ట్ సంస్థ కీలక ప్రకటన చేసింది. విండోస్ 10 రిలీజైన తర్వాత కూడా చాలా మంది కంప్యూటర్ వినియోగదారులు ఇంకా విండోస్ 7నే వాడుతున్నారు. దీంతో విండోస్ 7కు స్వస్తి పలకాలని హైక్రోసాఫ్ట్ కోరింది. విండోస్ 7 స్థానంలో విండోస్ 10ను ఇన్ స్టాల్ చేసుకోవాలని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. దీనివల్ల వినియోగదారుల ఫైల్స్ కు మరింత సెక్యూరిటీ, అధునాతన ఫీచర్లు, కంపెనీ ఉత్పాదకత కూడా పెరుగుతుందని ప్రకటనలో తెలిపింది.