హాల్‌ మార్క్‌ ధ్రువీకరణను తప్పనిసరి చేసిన కేంద్రం

బంగారం ఆభరణాలు, బంగారంతో చేసిన కళాకృతులకు హాల్‌ మార్క్‌ ధ్రువీకరణను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిబంధనలను నోటిఫై చేసింది. 2021 జనవరి 15 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఆభరణాల వర్తకులకు ఏడాది సమయాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఆ తర్వాత నుంచి ఆభరణాలను హాల్‌ మార్క్‌ సర్టిఫికేషన్‌తోనే విక్రయించాల్సి ఉంటుంది. లేదంటే భారతీయ ప్రమాణాల చట్టం 2016 కింద చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. నమోదిత ఆభరణాల విక్రయదారులే హాల్‌ మార్క్‌ కలిగిన బంగారం కళాకృతులను విక్రయించడానికి అనుమతిస్తారు.