భువనేశ్వర్‌ కు లండన్‌ లో విజయవంతంగా శస్త్ర చికిత్స

స్పోర్ట్స్‌ హెర్నియాతో జట్టుకు దూరమైన భారత పేస్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు లండన్‌లో శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగింది. కాస్త విశ్రాంతి అనంతరం అతను తిరిగొచ్చి జాతీయ క్రికెట్‌ అకాడమీ లో పునరావాస చికిత్స తీసుకొంటాడని బీసీసీఐ ప్రకటించింది. ఫిజియోథెరపిస్ట్‌ యోగేశ్‌ పర్మార్‌ కూడా భువీతో పాటే ఉండి అతని చికిత్సను పర్యవేక్షిస్తున్నాడని కూడా తెలిపింది. అయితే ఎప్పటిలోగా అతను పూర్తిగా కోలుకొని భువీ మళ్లీ బరిలోకి దిగుతాడనే విషయంతో బోర్డు స్పష్టతనివ్వలేదు.