దేశ సరిహద్దుల్లో పాక్‌ కుట్రలు

దేశ సరిహద్దుల్లో పాక్‌ కుట్రలకు తెరలేపుతోందని ఐబీ వర్గాలు కేంద్రాన్ని హెచ్చరించాయి. పాకిస్థాన్ కుట్రలపై హోంశాఖకు కీలక నివేదికను అందించాయి. భద్రతా దళాలే లక్ష్యంగా దాడులకు దాయాది దేశం ప్లాన్ చేస్తోందని నివేదికలో పేర్కొన్నాయి. బోర్డర్ యాక్షన్ టీమ్ ద్వారా ఈ దాడులకు ప్లాన్‌ చేసిందన్న ఐబీ హెచ్చరికలతో జమ్మూకశ్మీర్‌ పోలీసులు అప్రమత్తం అయ్యారు. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.