సెంచరీకి 4 పరుగుల దూరంలో ధావన్ ఔట్…

రాజ్‌ కోట్ వన్డేలో భారత్ కీలక వికెట్ కోల్పోయింది. ధావన్ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో ఔటయ్యాడు. 90 బంతుల్లో 96 పరుగుల చేసిన ధావన్.. రిచర్డ్ సన్ వేసిన 28వ ఓవర్‌లో 4వ బంతిని షాట్ ఆడబోయి.. స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చాడు. అంతకుముందు 60 బంతుల్లో 50 పరుగులు చేసిన ధావన్… 184 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. కాగా.. సెంచరీకి మరో నాలుగు పరుగుల దూరంలో ధావన్ ఔట్ అవ్వడం అభిమానులను నిరాశకు గురి చేసింది. ఇక.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ.. ఆసీస్ స్పిన్న‌ర్ జంపా బౌలింగ్‌లో ఎల్బీడ‌బ్ల్యూ ఔట‌య్యాడు. 44 బంతుల్లో ఆరు ఫోర్లతో.. రోహిత్ 42 పరుగులు చేశాడు. ప్రస్తుతం ధావ‌న్, కోహ్లీ క్రీజ్‌లో ఉన్నారు. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో.. ఇండియా మొదట బ్యాటింగ్‌కు దిగింది.