సంస్కరణల వెనుక పుతిన్‌ అధికార కాంక్ష…!

తాను జీవించి ఉన్నంతకాలం రష్యాలో అధికారం చెలాయించే దిశగా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ రాజకీయ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. చట్టసభ సభ్యులే ప్రధాన మంత్రిని, మంత్రివర్గాన్ని ఎన్నుకోవాలని, అధికారంలో వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలంటూ గురువారం ప్రధాని దిమిత్రీ మెద్వదేవ్‌ సంస్కరణలను ప్రతిపాదించారు. అనంతరం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దిమిత్రీ స్థానంలో ప్రధానిగా ఎంపికయ్యేందుకు ప్రస్తుతం పన్ను సేవల అధికారిగా ఉన్న మిఖాయిల్‌ ప్రయత్నిస్తున్నారు. రష్యా పార్లమెంట్‌ నూతన ప్రధానిని ఎన్నుకోనుంది. అటు ప్రభుత్వంలో పార్లమెంట్‌కు, పార్టీలకు మరిన్ని బాధ్యతలు అప్పగించనున్నట్లు పుతిన్‌ తెలిపారు. పార్లమెంటరీ వ్యవస్థ పాలనలో దేశం మరింత స్థిరంగా ఉంటుందన్నారు. మరోవైపు, ఈ సంస్కరణల వెనుక పుతిన్‌ అధికార కాంక్ష దాగి ఉన్నదని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. తాను కోరుకున్నంత కాలం అధికారంలో ఉండేలా మార్పులు తెస్తున్నారని మండిపడ్డారు.