దర్బార్’వసూళ్లపై ‘పట్టాస్’ప్రభావం…!

రజనీకాంత్ – మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్’. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమా… జనవరి 9వ తేదీన సంక్రాంతి బరిలోకి దిగింది. అయితే.. తెలుగులో ఓ మాదిరి ఓపెనింగ్స్ ను రాబట్టిన ఈ చిత్రం… తమిళనాట మాత్రం భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. కాగా, ఇదే సమయంలో.. తలైవా సినిమాకు పోటీగా… ధనుశ్ ‘పట్టాస్’ మూవీ జనవరి 15వ తేదీన విడుదలైంది. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ధనుశ్ ద్విపాత్రాభినయం చేశాడు. ఈ సినిమా కూడా వసూళ్ల పరంగా తమిళనాట దుమ్మురేపేపుతోంది. ఇక.. ధనుశ్ పట్టాస్‌ సినిమాకు హిట్ టాక్ రావడంతో… ‘దర్బార్’ వసూళ్లకు గండిపడిందనే కోలివుడ్ సర్కిల్స్‌లో ప్రచారం సాగుతోంది. గ్రామీణ నేపథ్యంతో కూడిన కథాకథనాలు.. ధనుశ్ ద్విపాత్రాభినయం ఆకట్టుకోవడం వల్లనే అక్కడ ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రభావం… వీకెండ్ లో మరింతగా కనిపించే అవకాశం ఉందని అనుకుంటున్నారు.