2025 నాటికి 10 లక్షల ఉద్యోగాలు :అమెజాన్‌

అమెజాన్‌ సొంతలాభం కోసం తప్ప భారత్‌ కోసం పనిచేయడం లేదని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ కంపెనీ కీలక ప్రకటన చేసింది. రానున్న ఐదేళ్లలో భారత్‌లో పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపింది. ఐటీ, నైపుణ్యాభివృద్ధి, కంటెంట్‌ క్రియేషన్‌, రిటైల్‌, లాజిస్టిక్స్‌, తయారీ పరిశ్రమల్లో ఉద్యోగాలు సృష్టించనున్నట్లు అమెజాన్ సీఈవో బెజోస్‌ తెలిపారు. గత ఆరేళ్లలో అమెజాన్‌ పెట్టుబడుల ద్వారా ఏడు లక్షల మందికి ఉపాధి లభించిందన్నారు. రానున్న ఐదేళ్లలో కల్పించే ఉద్యోగాలు వీటికి అదనమని వివరించారు.