ఇరాన్‌ సుప్రీం లీడర్‌ పై ట్రంప్‌ విమర్శలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇరాన్‌ కు మళ్లీ షాకిచ్చారు. ఇరాన్‌ సుప్రీం లీడర్ నోరును అదుపులో పెట్టుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కకొవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికే ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందన్న ట్రంప్‌.. అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తనను విదూషకుడు, డేంజరస్‌ మ్యాన్‌ గా అభివర్ణించిన ఖమేనీ పై విమర్శలు గుప్పించారాయన. విమానాన్ని కూల్చివేసి 176మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఇరాన్‌..ఇప్పుడు ప్రపంచ దేశాలకు సుద్దులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు ట్రంప్‌