టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా

భారత్‌తో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆసీస్‌ జట్టులో రిచర్డ్‌సన్‌ స్థానంలో హేజల్‌వుడ్‌ వచ్చి చేరగా, భారత జట్టులో ఎలాంటి మార్పు లేదు. కాగా ఇరు జట్లు సిరీస్‌లో ఇప్పటికే 1-1తో సమ ఉజ్జీలుగా నిలవగా ఆఖరిదైన ఇవాళ్టి వన్డే విజేతను నిర్ణయించనుంది