కలిసి ఉంటారా..? స్వతంత్రంగా ఉంటారా..?

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ లో రెఫరెండం నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌. పాకిస్థాన్‌ తో కలిసి ఉంటారా లేక స్వతంత్రంగా ఉంటారా అనేది పీవోకే ప్రజలు నిర్ణయించుకోవాలని చెప్పారు. పీవోకేలో ఇమ్రాన్‌ సర్కార్‌ కి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు పాక్‌ ప్రధాని. పీవోకేలో స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరుగుతాయని, అన్ని దేశాల నుంచి సందర్శకులను ఆహ్వానిస్తానని ఇమ్రాన్‌ చెబుతున్నారు.  ఇదిలా ఉంటే పాకిస్థాన్‌ నుంచి స్వాతంత్య్రం కోరుతూ వేలాది మంది ప్రజలు పీవోకేలో రోడ్లెక్కుతున్నారు. ఇమ్రాన్‌ గోబ్యాక్‌, కశ్మీర్‌ బనేగా హిందూస్థాన్‌ అంటూ నినాదాలు చేస్తున్నారు.