ధోనీ రికార్డులను బద్దలు కొట్టిన కోహ్లీ

అన్నిఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు సాధించిన భారత సారథిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు.  కోహ్లీ ఇప్పటి వరకు 11వేల 208పరుగులు చేశాడు. అంతకుముందు ఈ రికార్డు 11వేల 207 పరుగులతో ధోనీ పేరిట ఉండేది. అయితే ధోనీ దీనిని 330 ఇన్నింగ్స్‌ ల్లో ఈ ఘనత సాధించగా.. కోహ్లీ 199 ఇన్నింగ్స్ లోనే అందుకున్నాడు. ఇక వన్డే ఫార్మాట్‌లో అత్యంత వేగంగా అయిదు వేల పరుగులు పూర్తిచేసిన భారత సారథిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ధోనీ 127 ఇన్నింగ్స్‌ ల్లో 5వేల పరుగుల మైలురాయిని అందుకోగా.. కోహ్లీ.. 82 ఇన్నింగ్స్‌ ల్లోనే సాధించాడు.