పెరియార్‌పై వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పేది లేదు

తమిళజాతి పితామహుడు పెరియార్‌ రామస్వామిపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పేది లేదన్నారు తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ మేగజైన్ 50వ వార్షికోత్సవంలో రజనీకాంత్‌ పాల్గొన్నారు. 1971లో పెరియార్‌.. రాముడు, సీత విగ్రహాలకు చెప్పులు దండల వేసి ఊరేగించారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తమిళనాడులో దుమారం చెలరేగింది. రజనీకాంత్‌ క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్‌ వ్యక్తమైంది. నిరసనలపై స్పందించిన రజనీకాంత్‌ తన వ్యాఖ్యలు కొత్తవి కాదని, ఇందుకు సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని అన్నారు.