న్యూజిలాండ్ టీ20 సిరీస్‌కు ధావన్ దూరం…

న్యూజిలాండ్ పర్యటనకు సిద్ధమవుతున్న టీమ్ ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌ నెగ్గిన భారత్.. అదే ఊత్సాహంతో కివీస్‌ పర్యటనకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా సిరీస్‌లో తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్న సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌.. భుజానికి గాయం కారణంగా కివీస్‌ పర్యటనకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలోనే కివీస్‌ పర్యటనకు వెళ్లిన భారత జట్టుతో ధావన్ వెళ్లలేదు. ఆస్ట్రేలియా సిరీస్‌ మూడో వన్డేలో… ఆ జట్టు ఓపెనర్‌ అరోన్‌ ఫించ్‌ కొట్టిన షాట్‌ను ఆపే క్రమంలో ధావన్‌ భుజానికి గాయమైంది. దీంతో తర్వా బ్యాటింగ్‌కు కూడా రాలేదు. గాయం తీవ్రత దృష్ట్యా వెంటనే ఎక్స్‌రే తీయించుకున్న ధావన్‌… మ్యాచ్‌ అనంతరం మైదానంలో ఎడమచేతికి కట్టుతోనే కనిపించాడు. ఇక… సుదీర్ఘ విదేశీ పర్యటనకు వెళ్లిన కోహ్లీసేన… కీవిస్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ శుక్రవారం జరగనుంది.