‘తన్హాజీ’వసూళ్ల సునామీ…

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవ్‌గన్‌ మరాఠా యోధుడిగా నటించిన చిత్రం `తన్హాజీ` మహారాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రం వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నెల 10న విడుదలైన ఈ చిత్రం… 11 రోజుల్లోనే రూ.175 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా రెండో వారంలోనూ ధీటుగా వసూళ్లు రాబడుతుండటంతో… రూ. 200 కోట్ల మార్కును అందుకోవడం ఖాయమని బాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే, తన్హాజీ రిలీజ్ అయిన రోజే విడుదలైన ఛపాక్ ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.