బుర్కినా ఫాసోలో ఉగ్రదాడి, 36మంది మృతి

బుర్కినా ఫాసో వరుస ఉగ్రదాడులతో వణికిపోతోంది. అలమౌ, నాగ్రగొ గ్రామాల్లో విరుచుకుపడ్డ మిలిటెంట్లు 36మంది పౌరులను పొట్టనపెట్టుకున్నారు. తీవ్రవాదుల దాడుల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్స్‌ కు తరలించి చికిత్స అందిస్తున్న భద్రతా బలగాలు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నాయి.  దాడుల నేపథ్యంలో సన్మాటెంగా ప్రావిన్స్‌ ప్రజలను ఖాళీ చేయించిన అధికారులు.. సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మిలిటెంట్ల దాడిని ఖండించిన బుర్కినా అధ్యక్షుడు రోచ్‌ మార్క్‌..రెండు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు.