నిజమైన హీరోలు అనిపించుకున్న జవాన్లు

జవాన్లకు మించిన నిజమైన హీరోలు మరొకరు ఉండరని మళ్లీ రుజువైంది. తమ ప్రాణాలను పణంగా పెట్టి ఆపదలో ఉన్నవారిని రక్షించి హీరోలుగా జేజేలు అందుకుంటున్నారు. తాజాగా చత్తీస్‌ గఢ్‌ లో ఇలాంటి ఘటనే జరిగింది. బీజాపూర్‌ లో ఓ గర్భిణికి తక్షణ వైద్యం సాయం అవసరమవగా.. విషయం తెలుసుకున్న సీఆర్‌పీఎఫ్ జవాన్లు వెంటనే ముందుకొచ్చారు. ఆమె కూర్చున్న మంచానికే తాళ్లు కట్టి కావడిలా మార్చేసి ..అటవీ ప్రాంతమైన పడెద గ్రామం నుంచి  6కి.మీ నడిచి మెయిన్‌ రోడ్డు చేరుకున్నారు. అక్కడి నుంచి వాహనంలో ఆమెను ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గర్భిణి ప్రాణాలు నిలిపిన సీఆర్‌పీఎఫ్ జవాన్లపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.