సిరియా తిరుగుబాటు దారులపై రష్యా వైమానిక దాడులు

సిరియాపై రష్యా వైమానిక దాడులతో విరుచుకు పడుతొంది. అలెప్పో, ఇడ్లిబ్‌, కేఫర్‌ తాల్‌ నగరాల్లో నక్కిన ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు రష్యన్‌ సైన్యం జరిపిన ఎయిర్‌ స్ర్టైక్స్‌ లో 23మంది మృతి చెందారు. మృతుల్లో 13మంది చిన్నారులున్నట్టు అధికారులు గుర్తించారు.  అయితే దాడులపై స్పందించిన అల్‌ ఖైదా..ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించింది.