విజయ్ దేవరకొండ-పూరీ కాంబినేషన్‌లో సినిమా ప్రారంభం…

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంభినేషన్‌లో కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని ముంబైలో నిర్వహించారు. ఈ మేరకు చార్మి ముహుర్తపు షాట్‌కు క్లాప్‌ కొట్టగా, ఆ ఫొటోలను ఆమె తన ట్విట్టర్ ఖాతాలో షేర్‌ చేసింది. ఈ మూవీకి ‘ఫైటర్‌’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉండగా, యాక్షన్‌, ప్రేమ కథాంశాలతో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక గెటప్‌లో కనిపించనున్న ఈ సినిమా కోసం… విజయ్ థాయిలాండ్ వెళ్లి మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఇక ఈ మూవీలో విజయ్‌ దేవరకొండ సరసన ఎవరు నటిస్తారనే దానిపై స్పష్టత రాలేదు. విజయ్ సరసన జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుందని గతంలో వార్తలొచ్చాయి, తాజాగా, బాలీవుడ్‌ నటి అనన్య పాండే పేరు కూడా వినిపిస్తోంది.